తిరుప్పత్తూరు నియోజకవర్గంలో దళపతి విజయ్ నేతృత్వంలోని TVK అభ్యర్థి శ్రీనివాస సేతుపతి, ఒక్కటంటే ఒక్క ఓటు మెజారిటీతో గెలుపొందడం సంచలనం సృష్టించింది. ఈ నియోజకవర్గానికి చెందిన మణికందన్ అనే వ్యక్తి దళపతి విజయ్ మీద ఉన్న అభిమానంతో, మస్కట్ నుంచి వచ్చారు. “నా ఒక్క ఓటుతో ఏమవుతుందిలే అని అనుకోకుండా, మస్కట్ నుంచి వచ్చి వేసిన నా ఓటు వల్లే ఈరోజు మా అభ్యర్థి గెలిచారు.. నా కష్టానికి ప్రతిఫలం దక్కింది” అని ఆయన గర్వంగా చేసిన ట్వీట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.

