విశాఖ నగరంలోని గాజువాక వికాస్‌నగర్‌లో ఓ భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. మరో ఏడుగురికి గాయాలయ్యాయి. జాకీల సహాయంతో లిఫ్ట్ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. భవన శిథిలాల
కింద మరో ముగ్గురు చిక్కుకున్నట్లు సమాచారం. రెస్క్యూ బృందాలు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి.