ఐపీఎల్ చరిత్రలో KKR జట్టు సునీల్ నరైన్ అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో తన మొదటి వికెట్ పడగొట్టడం ద్వారా ఐపీఎల్ లో 200 వికెట్లు పూర్తి చేసుకున్న మొదటి విదేశీ ప్లేయర్ గా అతను రికార్డ్ సృష్టించాడు. 200 వికెట్ల డబుల్ సెంచరీ మార్కును అందుకున్న మూడో బౌలర్‌గా నరైన్ నిలిచాడు. ఐపీఎల్ లో ఇప్పటివరకు కేవలం యుజువేంద్ర చాహల్ (228 వికెట్లు),భువనేశ్వర్ కుమార్ (215 వికెట్లు) ఈ జాబితాలో ఉన్నారు.

