ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్, టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు ఎట్టకేలకు తన పంతం నెగ్గించుకున్నారు. తన నియోజకవర్గం ఉండి పరిధిలోకి వచ్చే ఆకివీడులోని పెద్దపేటలో ఉన్న గొంతెనమ్మ ఆలయాన్ని రాత్రికి రాత్రే కూల్చి, దాని స్ధానంలో రామాలయ నిర్మాణం చేపట్టేందుకు రఘురామ చేస్తున్న ప్రయత్నాలు కొలిక్కి వచ్చాయి. ఆకివీడు పెద్దపేటలో రామాలయ నిర్మాణానికి రఘురామకృష్ణంరాజు శంఖుస్థాపన చేశారు. ఆయన కుటుంబ సభ్యులతో పాటు మాజీ ఎంపీ కనుమూరి బాపిరాజు, కూటమి పార్టీల కార్యకర్తలు, నేతలు ఈ కార్యక్రమానికి తరలివచ్చారు

