నల్లగొండ జిల్లా చిట్యాల మండలం పేరేపల్లి గ్రామశివారులోని నోష్ ఫార్మా ల్యాబ్లో ఈరోజు (శుక్రవారం) రియాక్టర్ పేలింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. మేడే రోజే ఈ దుర్ఘటన జరగడం కార్మికులలో ఆందోళనను మరింత పెంచింది. పేరేపల్లి గ్రామ శివారులో ఉన్న నోష్ ఫార్మా కంపెనీలోని బ్లాక్-3లో ఈరోజు ఒక్కసారిగా రియాక్టర్ పేలింది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో బ్లాక్లో పని చేస్తున్న 9 మంది కార్మికులు గాయపడ్డారు. వీరిలో ఒకరి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు సమాచారం.

