మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. గురువారం సాయంత్రం బర్గి డ్యామ్‌లో పర్యాటకులతో వెళ్తున్న ఎంపీ టూరిజం క్రూయిజ్ షిప్ అకస్మాత్తుగా మునిగిపోయింది. ఈ ప్రమాద సమయంలో క్రూయిజ్‌లో 29 మంది పర్యాటకులు, ఇద్దరు సిబ్బంది ఉన్నట్లు సమాచారం. ఇప్పటివరకు నలుగురు మరణించగా, 15 మందిని రక్షించారు. మరో 11 మంది గల్లంతయ్యారు.సమయానికి బలమైన తుఫాను రావడం, అలలు ఎగిసిపడటమే ప్రాథమిక కారణమని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.

