ఆపరేషన్ దేవ్ లో భాగంగా తెలంగాణ కేంద్రంగా సాగుతున్న భారీ శిశు విక్రయాల ముఠాను గుజరాత్ పోలీసులు రట్టు చేశారు. చిన్నారుల అక్రమ రవాణా చేస్తున్న ఫెర్టిలిటీ సెంటర్స్‌పై గుజరాత్ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. కేసులో అరెస్ట్ అయిన మురుగన్ గ్యాంగ్ సమాచారం మేరకు పోలీసులు సోదాలు చేపట్టారు. ఈ ముఠా దేశవ్యాప్తంగా నవజాత శిశువులు, చిన్న పిల్లలను అపహరించి అక్రమంగా విక్రయించినట్టు పోలీసు వర్గాలు తెలిపాయి. మురుగన్ గ్యాంగ్ ఒక్క ఏడాదిలోనే 25 మంది చిన్నారుల విక్రయించినట్లు దర్యాప్తులో తేలింది.

