ఏఐ రాకతో ప్రపంచవ్యాప్తంగా టెక్ కంపెనీలు ఉద్యోగాల కోత విధిస్తున్నప్పటికీ, తాము మాత్రం ఆ మార్గాన్ని ఎంచుకోమని ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ పేర్కొంది. ఆటోమేషన్, ఏఐ టూల్స్ కీలక పాత్ర పోషిస్తున్నప్పటికీ గతేడాది తమ కంపెనీ ఉద్యోగాలు తొలగించలేదని, భవిష్యత్తులోనూ లేఆఫ్స్ ఉండవని ఇన్ఫోసిస్ సీఈవో సలీల్ పరేఖ్ ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఐటీ ఇండస్ట్రీలో ఏఐ అనేది పెను మార్పు అని, అయితే అది వెంటనే ఉద్యోగాలను తీసేయదన్నారు.

