పల్నాడు జిల్లా వినుకొండలో సీఐగా పనిచేసి, ప్రస్తుతం వీఆర్‌లో ఉన్న చిన్నమల్లయ్య ఒక ఫామ్ హౌస్‌లో బలవంతంగా అత్యాచారానికి పాల్పడినట్లు ఆ ఫామ్ హౌస్‌లో పని మనిషిగా పని చేస్తున్న మహిళా ఫిర్యాదు చేసింది. రక్షించాల్సిన అధికారియే భక్షకుడిగా మారాడంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ప్రస్తుతం నిందితుడు పోలీస్ శాఖలోనే ఉన్నత హోదాలో ఉండటంతో, తనకు న్యాయం జరుగుతుందో లేదో అన్న భయాందోళనలో బాధితురాలు ఉంది. ఈ నేపథ్యంలో ఆమె రాష్ట్ర ముఖ్యమంత్రికి, స్థానిక ఎమ్మెల్యేకు బహిరంగ విన్నపం చేసుకుంది

