బెంగళూరులో బుధవారం సాయంత్రం పిడుగులు, మెరుపులతో కురిసిన వర్షంతో శివాజీ నగర్ ప్రాంతంలోని బౌరింగ్ ఆస్పత్రిలో ఈదురుగాలులకు ప్రహరీ గోడ కూలి ముగ్గురు చిన్న పిల్లలు సహా ఏడుగురు మృతి చెందారు. మృతులంతా వీధి వ్యాపారం చేసుకునే వారేనని సమాచారం. నగరంలో భారీ వర్షానికి 50కి పైగా చెట్లు కూలిపోగా, రోడ్లన్నీ జలమయమయ్యాయి. బెంగళూరులో ఫేమస్ బుక్ స్టోర్ బుక్ వోర్మ్ వర్షానికి నీట మునిగింది. ఇందులో ఉన్న సుమారు 5 వేల పుస్తకాలు పూర్తిగా తడిసిపోయాయి.

