తుమ్మిడిహట్టి వద్ద బ్యారేజ్ నిర్మాణ కార్యాచరణ వేగవంతం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. 150 మీటర్ల ఎత్తున నిర్మిస్తే మహారాష్ట్రలో పెద్దగా ముంపు ప్రభావం ఉండదని అన్నారు. ఒకవేళ ముంపు వాటిల్లితే పరిహారం చెల్లించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. ఈ బ్యారేజ్ అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. తుమ్మిడిహట్టి బ్యారేజ్ విషయంలో మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించాలంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి లేఖ రాయాలని మంత్రి ఉత్తమ్ కుమారెడ్డికి సీఎం సూచించారు.

