ఐపీఎల్ చరిత్రలో విరాట్ కోహ్లీ పేరు సువర్ణాక్షరాలతో లిఖితమైంది. సోమవారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలోనే 9000 పరుగులు పూర్తి చేసిన మొట్టమొదటి బ్యాటర్‌గా రికార్డు సృష్టించాడు. ఐపీఎల్లో ఇప్పటివరకు 8 సెంచరీలు, 66 అర్ధ సెంచరీలతో కోహ్లీ తన ఆధిపత్యాన్ని చాటుతున్నాడు. కేవలం 7 మ్యాచ్‌ల్లోనే 54.66 సగటుతో 328 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ రేసులో ముందున్నాడు.

