రంగారెడ్డి జిల్లా పరిధిలోని శంకరపల్లి మండలంలో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు కార్మికులు మృతి చెందగా మరో 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను శంకరపల్లి ఆసుపత్రికి హుటాహుటినా తరలించారు. మండలంలోని మహాలింగాపురంలో NCC సిమెంట్ బ్రిక్స్ కంపెనీలో సోమవారం సాయంత్రం పనిచేస్తుండగా భారీ క్రేన్ ఒక్కసారిగా ప్రమాదవశాత్తు కుప్పకూలింది.

