అంబర్పూటలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. చే నంబర్ కూడలి వద్ద ఓ షోరూమ్‌లో భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలను ఆర్పేందుకు యత్నిస్తున్నారు. మంటల తీవ్రత ఎక్కువగా ఉండటంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. షోరూమ్ పక్కనే నివాస సముదాయాలు ఉండటంతో.. వారిని అక్కడి నుంచి తరలిస్తున్నారు.

