ఉస్మానియా యూనివర్సిటీలో ఇంజినీరింగ్ విద్యార్థి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. స్థానికుల వివరాల ప్రకారం… మహబూబాబాద్ జిల్లా గోవిందపురం గ్రామానికి చెందిన వినీశ్ ఓయూలో మైనింగ్ చదువుతున్నాడు. రేణుకా ఎల్లమ్మ ఆలయం వద్ద పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. స్థానికులు సమాచారం మేరకు పోలీసులు అక్కడికి చేరుకొని గాయపడిన అతడిని గాంధీ ఆస్పత్రికి తరిలించారు. ప్రేమ వ్యవహారమే కారణంగా పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

