ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపురం జిల్లా తాడిపత్రిలో వైసిపి కార్యకర్తను దారుణంగా హత్య చేశారు. అబ్దుల్ అలియాస్ బండాను దుండగులు నరికి చంపారు. తాడిపత్రి పట్టణంలోని ఏటిగడ్డపాళ్యంలో పట్టపగలు నడిరోడ్డుపై అబ్దుల్ నరికి చంపారు. అబ్దుల్ ఇంటికి వెళ్తుండగా మాటువేసి గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేశారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పాతకక్ష్యల నేపథ్యంలోనే ఈ హత్య జరిగిందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

