ఆఫ్రికా దేశం మాలి లో రాజధాని బమాకో, ఇతర నగరాలలో జిహాదీ యోధులు, వేర్పాటువాద రెబల్స్, సైన్యం మధ్య రెండో రోజు కూడా భీకర పోరు కొనసాగింది. ఈ క్రమంలో మాలి రక్షణ మంత్రి ఇంటిపై ముష్కరులు కారు బాంబుతో దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో రక్షణ మంత్రి,ఆయన రెండో భార్య, ఇద్దరు మనవరాళ్లు మరణించినట్టు కుటుంబ సభ్యులు, అధికార వర్గాలు తెలిపాయి. అజావాద్ లిబరేషన్ ఫ్రంట్ (FLA)కి చెందిన టువారెగ్ రెబల్స్, జిహాదీ గ్రూప్ (JNIM) సమన్వయంతో ఈ ఆకస్మిక దాడులను జరిపాయి.

