టాలీవుడ్ హీరోయిన్ మెహ్రీన్ వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారు. తన మిత్రుడు అర్ష్ ఔలఖ్ను ఆమె పెళ్లి చేసుకున్నారు. ఏప్రిల్ 26న జరిగిన తన వివాహ వేడుకకు సంబంధించిన విశేషాలను ఇన్స్టాగ్రామ్ ద్వారా తెలుపుతూ, కొత్త జీవితాన్ని ప్రారంభించినట్లు ఆమె ప్రకటించారు. కృష్ణగాడి వీర ప్రేమగాథ’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన మెహ్రీన్.. ‘ఎఫ్ 2’, ‘ఎఫ్ 3’ చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

