జనగణన 2027లో భాగంగా తెలంగాణలో నేటి నుంచి ‘సెల్ఫ్ ఎన్యుమరేషన్’ ప్రక్రియ ప్రారంభమైంది. తాజాగా సెన్సస్ 2027 స్వీయ నమోదు కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. అధికారిక వెబ్ పోర్టల్ ద్వారా తన వివరాలను స్వయంగా సీఎం నమోదు చేసుకున్నారు. ఈ సందర్భంగా సెన్సస్ అధికారులు స్వీయ నమోదు ప్రక్రియ విధానం, ప్రాముఖ్యత గురించి ముఖ్యమంత్రికి వివరించారు.

