తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగుల సమ్మెలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. వరంగల్ (D) నర్సంపేట ఆర్టీసీ డిపోలో గురువారం మధ్యాహ్నం ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి యత్నించిన ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ చికిత్సపొందుతూ మృతి చెందాడు. ఈ ఘటనలో శంకర్ గౌడకు ఊపిరితిత్తులు పూర్తిగా డ్యామేజ్ అయ్యాయి. 80 శాతం కాలిన గాయాలతో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న ఆయన్ను వరంగల్ MGM నుంచి హైదరాబాద్ కు తీసుకొస్తుండగా కర్మాన్ ఘాట్ దగ్గర కన్నుమూశారు. ప్రస్తుతం కంచన్బాగ్ DRDO అపోలో ఆస్పత్రిలో ఆయన మృతదేహం ఉన్నట్లు తెలుస్తోంది.

