నర్సంపేట డిపోలో ఆత్మహత్యకు యత్నించిన డ్రైవర్ శంకర్ గౌడ్ పరిస్థితి విషమంగా ఉందని వరంగల్ ఎంజీఎం వైద్యులు తెలిపారు. దీంతో అతడిని మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ కు తరలించారు. ఆర్టీసీ సమ్మెలో భాగంగా గురువారం మధ్యాహ్నం నర్సంపేట డిపోలో డ్రైవర్ శంకర్ గౌడ్ ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు యత్నించిన విషయం తెలిసిందే. తీవ్రగాయాలు కావడంతో తోటి కార్మికులు, స్థానికులు వరంగల్ ఎంజీఎంకు తరలించారు. చికిత్స పొందుతున్న శంకర్ గౌడ్ ను మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, పరామర్శించారు.

