పశ్చిమ బెంగాల్లో నేడు అసెంబ్లీ ఎన్నికల తొలి విడత పోలింగ్ జరుగుతోంది. ఈ నెల 29న రెండో విడత పోలింగ్ చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రంలోని కృష్ణానగర్లో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో ప్రధాని మోదీ మాట్లాడారు. బెంగాల్ ఎన్నికల్లో భాజపా విజయం సాధిస్తుందన్నారు. మే 4న బెంగాల్లో మిఠాయిలు, ఝాల్ మురీ (మరమరాల స్నాక్) పంచుతామన్నారు. తాను ఇటీవల ఝాల్ మురీ తిన్నానని అయితే ఆ ఘాటు మాత్రం టీఎంసీకి తగిలిందని వ్యంగ్యంగా వ్యాఖ్యలు చేశారు.

