తనకు సంతానం లేరనే విషయాన్ని అడ్డుపెట్టుకొని తన టీమ్ లీడ్ తౌసిఫ్ అక్తర్, సహోద్యోగి డానిష్ షేక్ తన భార్యను వారి వద్దకు పంపించమని నీచంగా మాట్లాడారని తెలిపారు. అంతే కాదు నన్ను చంపుతానంటూ బెదిరించినట్లుగా తెలిపాడు. తమ ఆఫీసులో బలవంతంగా మత మార్పిడికి పాల్పడినట్లుగా కూడా ఆరోపణలు చేశారు. ఇక మత మార్పిడికి అంగీకరించని వాళ్లను పని భారం పెంచి వేధించినట్లుగా ఆరోపించారు. ఇష్టానికి వ్యతిరేకంగా మతపరమైన ఆచారాలను పాటించమని ఒత్తిడి చేసినట్లుగా కూడా తెలిపారు.

