భారత రాజ్యాంగ విలువలు, లౌకికత, న్యాయవ్యవస్థ పాత్రపై సుప్రీంకోర్టు న్యాయమూర్తి కోటేశ్వర్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశం మతపరంగా కాకుండా రాజ్యాంగపరంగా ఎలా నిలబడిందో స్పష్టం చేస్తూ, “భారతదేశం ఎప్పుడూ
తనను హిందూ దేశంగా ప్రకటించుకోలేదు” అని ఆయన స్పష్టంగా పేర్కొన్నారు. ఢిల్లీలో నిర్వహించిన National Law Institute University Student Bar Association (NLIU-SBA) 2026 సదస్సులో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

