నియోజవర్గాల పునర్విభజన పై కేంద్రం తొందరపాటు వెనుకగల వ్యూహం ఏమిటనేది ప్రశ్నార్థకంగా ఉన్నదని సమాజ్వాది పార్టీ ఎంపీ, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ సతీమణి డింపుల్ యాదవ్ అన్నారు. కేంద్రం నియోజకవర్గాల పునర్విభజన నిర్ణయానికి ఆంధ్రప్రదేశ్ ఎందుకు మద్దతు పలుకుతున్నదో ఒకసారి ఆలోచించుకోవాలని ఆమె సూచించారు. నియోజకవర్గాల పునర్విభజనతో చిన్న రాష్ట్రాలు, దక్షిణాది రాష్ట్రాల ప్రాబల్యం తగ్గుతుందని, భవిష్యత్తులో కేంద్రానికి ఆ రాష్ట్రాల అవసరమే లేకుండా పోవచ్చునని ఆందోళన వ్యక్తంచేశారు.

