భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ 135వ జయంతిని పురస్కరించుకుని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో భారత శాశ్వత ప్రతినిధి బృందం ఘనంగా స్మారక కార్యక్రమాన్ని నిర్వహించింది. ‘అంబేడ్కర్ రాజ్యాంగ నైతికత దార్శనికత, బహుపాక్షికతలో దాని ప్రాసంగికత’ అనే ఇతివృత్తంతో ఈ కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించింది. ఈ మేరకు ఎక్స్‌లో పోస్ట్ చేసింది. ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత ప్రతినిధి హరీశ్ పర్వతనేని మాట్లాడుతూ, అంబేద్కర్ ప్రజల్లో రాజ్యాంగ నైతికతను పెంపొందించాలని చేసిన పిలుపు ప్రజాస్వామ్య చింతనలో విశిష్టమైనదని పేర్కొన్నారు.

