గాజియాబాద్ కు చెందిన ఇక్రా అనే యువతి (19).. తన స్నేహితుడు హసీంతో కలిసి రీల్స్ చేసేందుకు జాతీయరహదారి పైకి వెళ్లింది. ఆమె వేగంగా స్పోర్ట్స్ బైక్ నడిపిస్తుండగా.. హసీం వెనుక కూర్చొని వీడియో చిత్రీకరిస్తున్నాడు. వీడియో కోసం ఇక్రా వెనక్కి తిరిగిన సమయంలో బైక్ రహదారిపైనున్న డివైడర్ ను వేగంగా ఢీకొంది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఇక్రా మృతి చెందింది. ఆమె స్నేహితుడి పరిస్థితి విషమంగా ఉంది.

