తిరుపతిలో సోమవారం సాయంత్రం చనిపోయిన బాలిక కేసులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. బాలిక రీల్స్ చేస్తూ భవనం పైనుంచి కిందపడి చనిపోలేదని.. బాలికది ఆత్మహత్యగా పోలీసులు గుర్తించారు. అన్న వరుస అయ్యే వ్యక్తిని బాలిక ప్రేమించిందని.. ఈ విషయం తెలిసి తల్లి మందలించటంతో మనస్తాపంతో ఐదో అంతస్తు నుంచి దూకి చనిపోయినట్లు వెల్లడించారు. రీల్స్ పిచ్చితో ప్రాణాలు పోగొట్టుకుందంటూ వార్తలు కూడా వచ్చాయి.అయితే అందరూ అనుకున్నట్లుగా బాలిక రీల్స్ చేస్తూ ప్రమాదవశాత్తూ కిందపడి చనిపోలేదని పోలీసుల విచారణలో తేలింది.

