పంజాబ్‌కు చెందిన సందీప్ తోమర్ ఇండియన్ ఆర్మీలో కెప్టెన్‌గా పని చేసేవాడు.2013లో అతడు తన భార్యను హత్య చేశాడు. హత్య కేసులో యావజ్జీవ కారాగార శిక్ష పడి బెయిలు పై బయటకు వచ్చి తప్పించుకు తిరుగుతున్నాడు. సందీప్‌ను పట్టుకునేందుకు పోలీసులు నాలుగేళ్లుగా ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఇటీవల ఆధార్, పాన్ ద్వారా ఒక సిలిండర్ బుక్ చేసుకుని, దానికి డబ్బులు కూడా చెల్లించాడు. దీంతో అతడు మధ్యప్రదేశ్‌లో ఉన్నట్లు అతడికి సిలిండర్ అందించిన గ్యాస్ ఏజెన్సీని సంప్రదించి, వారి ద్వారా అతడి ఆచూకీ కనుక్కున్నారు

