ఇరాన్ – ఇజ్రాయెల్, అమెరికాల మధ్య ఉద్రిక్తతలు ఏడో రోజుకు చేరుకున్నాయి. తాజాగా.. హొర్ముజ్ జలసంధి ఒమన్ గల్ఫ్‌లో స్కైలైట్ అనే ఆయిల్ ట్యాంకర్‌పై ఇరాన్ చేసిన దాడిలో ఇద్దరు భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. మృతులను బిహార్‌కు చెందిన కెప్టెన్ ఆశిష్ కుమార్, మహారాష్ట్రలోని ముంబైకి చెందిన దీక్షిత్ సోలంకిగా గుర్తించారు.ఒమన్‌లోని ముసాందమ్ ఐల్యాండ్ సమీపంలో అనగా ఖసాబ్ ఓడరేవుకు ఉత్తరాన సుమారు 5 నాటికల్ మైళ్ల దూరంలో ఈ దాడి జరిగింది.

