బ్రెజిల్ దేశాన్ని భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. ముఖ్యంగా మినాస్ గెరైస్ రాష్ట్రంలో ప్రకృతి తన ప్రతాపాన్ని చూపిస్తోంది. కేవలం కొద్ది రోజుల్లోనే అక్కడ రికార్డు స్థాయిలో 584MM వర్షపాతం నమోదవ్వడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఇంతటి భారీ వర్షాల కారణంగా స్థానిక నదులు ప్రమాదకర స్థాయిని మించి ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి.కేవలం వరదలే కాకుండా, వర్షాల ధాటికి కొండ ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడటం తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ప్రమాదాల్లో ఇప్పటివరకు 30 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 39 మంది గల్లంతయ్యారు.

