ఇరాన్ బోటును భారత కోస్ట్ గార్డ్ అడ్డుకున్నది. రూ.5 కోట్ల విలువైన విదేశీ సిగరెట్లను స్వాధీనం చేసుకున్నది. ఆ బోటులో ఉన్న నలుగురు ఇరాన్ పౌరులను అదుపులోకి తీసుకున్నది. గుజరాత్ తీరంలోని అరేబియా సముద్రంలో ఈ సంఘటన జరిగింది. ఫిబ్రవరి 21న ద్వారకాకు పశ్చిమాన సుమారు 115 నాటికల్ మైళ్ల దూరంలో అనుమానాస్పద విదేశీ పడవను భారత కోస్ట్ గార్డ్ సిబ్బంది గుర్తించారు. అల్ ముఖ్తార్‌గా గుర్తించిన ఇరాన్ పడవ, అందులో ఉన్న నలుగురు సిబ్బందిని గుజరాత్‌లోని పోర్‌బందర్‌కు తరలించినట్లు వెల్లడించింది.

