హైదరాబాద్ పోలీసులు వినూత్న నిర్ణయం తీసుకున్నారు. విద్యార్థుల కోసం ఇంటర్న్‌షిప్ ప్రోగ్రాం ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నారు. సిటీ పోలీసు విభాగంలో 25 ఏళ్లలోపు డిగ్రీ, పిజి విద్యార్థులకు ఈ ఇంటర్న్‌షిప్‌లో అవకాశం కల్పించనున్నారు. ఆధునిక పోలీసింగ్‌లో విద్యార్థులను పోలీసులు భాగస్వామ్యం చేయనున్నారు. డేటా అనాలిసిస్, రీసెర్చ్ ప్రాజెక్టుల్లో విద్యార్థులను భాగస్వామ్యం చేయనున్నట్లు వెల్లడించారు. ఇంటర్న్‌షిప్ పూర్తి చేసిన వారికి అధికారిక సర్టిఫికేట్లు జారీ చేయనున్నారు. ఎస్ఎంఐటి సెల్ పర్యవేక్షణలో పోలీసులు దీన్ని అమలు చేయనున్నారు.

