నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ డైరెక్టర్ సుందరి కిరణ్ కుమార్ ఇల్లు, మరో ఆరుచోట్ల ఏసీబీ అధికారులు జరిపిన దాడుల్లో100 ఎకరాల వ్యవసాయ భూమి, పది విలువైన ప్లాట్లు, ఐదు ఫోర్ వీలర్ వాహనాలు, ఐదు ట్రాక్టర్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వీటి విలువ రూ. 15 కోట్లు అని చెబుతున్నప్పటికీ మార్కెట్ విలువ ప్రకారం రూ. 50 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మహబూబ్ నగర్ ఏసీబీ డీఎస్పీ బాలకృష్ణ తెలిపారు.

