ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో టిబెట్ మత గురువు దలై లామా పేరు ఉన్నట్లు వార్తలు వచ్చాయి. 169 సార్లు ప్రస్తావించినట్లు రిపోర్టులు రావడంతో ఆయన ఆఫీసు స్పందించింది.. ఎక్స్ వేదికగా మీడియా ప్రకటన విడుదల చేశారు. మహిళలు, మైనర్లపై లైంగిక నేరాలకు పాల్పడ్డ నిందితుడు, ఎప్ స్టీన్ ను తాను ఎన్నడూ కలవలేదని స్పష్టం చేశారు. పత్రికల్లో వచ్చిన కథనాలు, సోషల్ మీడియా పోస్టుల్లో జెఫ్రీ ఎఫ్ స్టీన్ తో దలైలామా సమావేశమైనట్లు చూపించడంపై దలైలామా ఆఫీసు అభ్యంతరం వ్యక్తం చేసింది.

