లైంగిక నేరగాడు జెఫ్రీ ఎప్‌స్టీన్ కేసుకు సంబంధించి ఇటీవల అమెరికా న్యాయశాఖ విడుదల చేసిన పలు దస్త్రాలు తాజాగా బ్రిటన్‌లోనూ కలకలం రేపుతున్నాయి. ఈ దస్త్రాల్లో బ్రిటన్ రాయబారి పీటర్ మాండెల్సన్ పేరు కూడా ఉండటంతో తాజాగా బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ క్షమాపణలు తెలిపారు. జెఫ్రీ ఎప్‌స్టీన్‌తో పీటర్ మాండెల్సన్‌కు అంత క్లోజ్ ఫ్రెండ్‌షిప్ ఉన్నదని తెలియక ఆయన్ను రాయబారిగా నియమించినట్టు బ్రిటన్ ప్రధాని చెప్పుకొచ్చారు. ఆ తరువాత ఎప్‌స్టీన్‌తో స్నేహం వెలుగులోకి రావడంతో బ్రిటన్ ప్రభుత్వం ఆయనను తొలగించింది.

