ప్రపంచంలో ఏ దేశం నుంచైనా చమురును కొనే స్వేచ్ఛ భారత్కు ఉందని, విభిన్న ముడి చమురు సరఫరాదారులను ఆశ్రయించడం భారత్కు కొత్త కాదని రష్యా అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ వ్యాఖ్యానించారు. తక్కువ గ్రేడ్లను కలిగి ఉండే చమురును అమెరికా నుంచి భారత్ అధిక ధరకు కొనాల్సి ఉంటుంది. రష్యా రోజుకు 15 నుంచి 20 లక్షల బ్యారెళ్ల చమురును భారత్కు సరఫరా చేస్తోంది. అంత భారీగా అమెరికా చేయలేదు’ అని రష్యా ఇంధన భద్రత నిపుణుడు ఐగోర్ యుష్కోవ్ పేర్కొన్నారు

