ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలిశారు. ఉండవల్లిలోని సీఎం నివాసానికి పవన్ వెళ్లారు.. ఇద్దరు నేతలు పలు కీలక అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలో పాటుగా రాజ్యసభ ఎన్నికలు, నామినేటెడ్ పదవులు, తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం విషయంలో వైఎస్సార్సీపీ చేస్తున్న ప్రచారం గురించి కూడా ఇద్దరు నేతలు మాట్లాడుకున్నట్లు సమాచారం. కేబినెట్ సమావేశం జరిగిన మరుసటి రోజే ఇద్దరు నేతల భేటీ కావడం ఆసక్తికరంగా మారింది.

