శబరిమల బంగారం చోరీ కేసులో సీనియర్ నటుడు జయరామ్ని సిట్ శుక్రవారం విచారించింది. బంగారం పూత కోసం ఆలయం నుంచి తీసుకొచ్చిన తాపడాలతో 2019లో ఈ కేసులో ప్రధాన నిందితుడు ఉన్నికృష్ణన్ నిర్వహించిన పూజల్లో జయరామ్ పాల్గొన్న వీడియోలు ఇటీవలనే బయటకు వచ్చాయి. ఈ నేపథ్యంలో వీళ్లిద్దరి మధ్య ఆర్థిక లావాదేవీలు ఏవైనా జరిగాయా అని సిట్ ఆరా తీసినట్టు సమాచారం. శుక్రవారం చెన్నై లోని జయ్రామ్ నివాసానికి చేరుకున్న సిట్ అధికారులు ఆయనను సుదీర్ఘంగా ప్రశ్నించారు.

