హిందీని తమపై బలవంతంగా రుద్దేందుకు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఫలించవని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ చెప్పారు. తమిళనాడులో హిందీకి ఎప్పుడూ స్థానం లేదని, భవిష్యత్తులోనూ ఉండదని స్టాలిన్ స్పష్టంచేశారు. ఆదివారం నిర్వహించిన తమిళ భాషా అమరవీరుల దినోత్సవంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తమిళ ప్రజలు హిందీకి వ్యతిరేకంగా గతంలో తీవ్ర పోరాటం చేశారని స్టాలిన్ గుర్తుచేశారు. హిందీని తమపై రుద్దాలని చూసిన ప్రతిసారీ.. అదే తీవ్రతతో తమ నిరసన వ్యక్తం చేస్తామని చెప్పారు.

