ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ పుట్టిన రోజు సందర్భంగా శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి. లోకేశ్‌కు మంత్రులు, ఎంపీలు, టీడీపీ నేతలు, తెలుగు తమ్ముళ్లు, అభిమానులు పెద్దఎత్తున బర్త్‌డే విషెస్ తెలియజేస్తున్నారు. లోకేశ్ సతీమణి నారా బ్రాహ్మణి కూడా శుభాకాంక్షలు తెలియజేశారు. లోకేశ్ పుట్టిన రోజును పురస్కరించుకుని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా లోకేశ్‌కు పవన్ విషెస్ తెలిపారు.

