సింగరేణి కుంభకోణం వెలికి తీయడంతో తెరపైకి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం వచ్చిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. ప్రభుత్వాన్ని కూలగొట్టాలని రూ.50 లక్షలతో దొరికిన దొంగ రేవంత్ రెడ్డి అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. అలాంటి దొంగ ఇవాళ ముఖ్యమంత్రి అయ్యి కూర్చున్నాడని అన్నారు. బామ్మర్ది కాంట్రాక్ట్ రద్దు అయినందుకే రేవంత్ కక్షపూరిత కుట్రలకు పాల్పడుతున్నాడని కేటీఆర్ మండిపడ్డారు. రేవంత్ రెడ్డి అడుగులకు మడుగులొత్తే వాళ్లను వదిలిపెట్టమని హెచ్చరించారు.

