స్పెయిన్‌లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. కోర్డోబా ప్రావిన్స్‌లోని అడముజ్ ప్రాంతంలో రెండు హైస్పీడ్ రైళ్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో సుమారు 21 మంది మృతి చెందారు. మరో 100 మందికిపైగా గాయపడ్డారు. వీరిలో 25 మంది పరిస్థితి విషమంగా ఉంది. మాడ్రిడ్ నుంచి హువెల్యాకు వెళ్తున్న రెన్ఫే రైలును.. మాలాగా నుంచి మాడ్రిడ్‌కు వెళ్తున్న ఇర్యో హైస్పీడ్ రైలు ఢీకొట్టినట్లు రైల్వే అధికారులు తెలిపారు.

