వెనెజులా ప్రతిపక్ష నాయకురాలు మచాడో.. తనకు ఇచ్చిన ప్రైజ్ ను తీసుకెళ్లి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మెప్పు కోసం ఆయనకు తిరిగి ప్రదానం చేయడం తీవ్ర వివాదాస్పదమైంది. నార్వేకు చెందిన నోబెల్ అవార్డుల ఫౌండేషన్ స్పందించింది. ప్రతీ నోబెల్ బహుమతిని ప్రదానం చేసే హక్కు ఎవరికి ఉందో అది నిర్దేశిస్తుందని ఫౌండేషన్ ఓ ప్రకటనలో తెలిపింది. అందువల్ల ఒక బహుమతిని, ఊహకు కూడా మరెవరికీ బదిలీ చేయలేము లేదా పునఃప్రదానం కూడా చేయలేమని తేల్చిచెప్పేసింది. తద్వారా ట్రంప్-మచాడో ఎపిసోడ్ ను పరోక్షంగా తప్పుబట్టింది.

