నేడు నందమూరి తారక రామారావు 30వ వర్ధంతి. హైదరాబాద్‌లోని హుస్సేన్ సాగర్ తీరంలో ఉన్న ఎన్టీఆర్ ఘాట్‌ను ఏపీ ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేశ్ సందర్శించారు. తాత సమాధిపై పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. లోకేశ్ ‘ఎక్స్’ వేదికగా స్పందిస్తూ ఎన్టీఆర్ కు నివాళి అర్పించారు. తెలుగు జాతి ఆత్మగౌరవ పతాకం, విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు, తారక రాముడు పోషించిన పౌరాణిక పాత్రల ఫోటోలను ఇళ్లలో పెట్టుకొని ప్రజలు దేవుడిగా పూజించడం ఎన్టీఆర్‌కు మాత్రమే దక్కిన వరం. అని పేర్కొన్నారు.

