థాయిలాండ్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. నఖోన్ రాట్చసిమా ఫ్రావిన్స్‌లో ఓ ప్రయాణికుల రైలుపై క్రేన్ కూలిపోయింది. దీంతో రైలు పట్టాలు తప్పింది. ఈ ఘటనలో 22 మంది మరణించగా, కనీసం 30 మంది వరకు గాయపడ్డారని స్థానిక అధికారులు తెలిపారు. బ్యాంకాక్ నుంచి ఈశాన్యంగా వెళ్తున్న ఉబోన్ రాట్చసిమా ప్రావిన్స్‌కు ప్రయాణిస్తున్న ప్యాసింజర్ రైలు హైస్పీడ్ రైలు ప్రాజెక్టు కోసం పనిచేస్తున్న క్రేన్ కూలిపోయి ఈ రైలుపై పడిపోయింది.

