బ్యాంకుల్లో వారంలో ఐదు పనిదినాలను డిమాండ్ చేస్తూ బ్యాంక్ ఉద్యోగుల సంఘం, ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్ (AIBOC), జనవరి 27, 2026 మంగళవారం రోజున దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చింది. బ్యాంకు ఉద్యోగుల డిమాండ్‌ను తరుచుగా నిర్లక్ష్యం చేస్తున్న నేపథ్యంలో ఈ సమ్మెకు పిలుపునిచ్చారు. బ్యాంకుల్లో వారానికి ఐదు రోజుల పని దినాలు (అన్ని శనివారాలు సెలవు దినాలు) డిమాండ్‌కు సంబంధించి మార్చి 2024లో సంతకం చేసిన వేతన సవరణ ఒప్పందం సమయంలో బ్యాంకు యూనియన్లు , ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (IBA) అంగీకరించాయి.

