ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనల్లో మరణించిన వారి సంఖ్య 500 దాటింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు చేస్తున్న నిరసనల సమయంలో అమెరికా దాడులకు పాల్పడితే కనుక తాము అమెరికా సైనికుల్ని, ఇజ్రాయెల్ను లక్ష్యంగా చేసుకుంటామని ఇరాన్ హెచ్చరించింది. అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్లో అశాంతిని ప్రేరేపించారని ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్ ఆరోపించారు. అమెరికా, ఇజ్రాయెల్ అల్లరి మూకలు, ఉగ్రవాదులను ఇరాన్ను అస్థిరపరచాలని ఆదేశిస్తున్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు.

