ఇరాన్లో పరిస్థితులు రోజురోజుకు చేయిజారిపోతున్నాయి. ప్రభుత్వ వ్యతిరేక నిరసనలతో దేశమంతా భగ్గుమంటోంది. దీంతో దేశవ్యాప్తంగా ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు. కనీసం టెలిఫోన్ కాల్స్ చేసుకుని మాట్లాడే పరిస్థితి కూడా లేదు. కాల్స్‌పై కూడ నిషేధం విధించారు. ఈ ప్రదర్శనలు ఇరాన్ 31 రాష్ట్రాల్లోని 180 నగరాల్లోని 512 ప్రదేశాలకు విస్తరించాయి. ఒక వైద్యుడు పరిస్థితిపై మాట్లాడుతూ, రాజధానిలోని ఆరు ఆసుపత్రులలో కనీసం 217 మంది నిరసనకారులు మరణించారని, వారిలో ఎక్కువ మంది కాల్పుల వల్లే మరణించారని టైమ్ మ్యాగజైన్‌తో అన్నారు.

