అమెరికాలో బందీగా ఉన్న వెనెజువెలా మాజీ అధ్యక్షుడు మదురో పెద్ద మొత్తంలో బంగారాన్ని స్విట్జర్లాండ్‌కు తరలించినట్లు తెలుస్తోంది. వాటి విలువ మొత్తం 5.2 బిలియన్ డాలర్లు అంటే భారత కరెన్సీలో దాదాపు రూ.46వేల కోట్లు ఉంటుందని అంచనా. ఆయన తొలిసారి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు దేశంలో ఆర్థిక సంక్షోభం నెలకొంది. ఆ సమయంలో దాన్ని నిలబెట్టేందుకు ప్రభుత్వం బంగారం విక్రయాలు చేస్తున్న సమయంలోనే.. ఈ తరలింపు స్విట్జర్లాండ్‌కు జరిగింది.
శుద్ధి, సర్టిఫికేషన్ వంటి వాటి కోసం వెనెజువెలా ఈ బంగారాన్ని తరలించి ఉండొచ్చని తెలుస్తోంది.

